Tuesday, June 29, 2010

నీటి తొట్టి లేక నీలి తొట్టి
















రాతి కట్టడం పేరు నీటి తొట్టి. దీనిని గురించి అక్కడే పొలంలో వున్నా రైతు ను విచారించగా దీనిని నీలి కావాలి అని కూడా అంటారని చెప్పాడు. ఇది నాదెండ్ల నుండి వినాయకుని గుడికి వెళ్ళే దారిలో ఎడమ వైపు కనిపిస్తుంది. దీనిని గురించి గ్రామం లోని పెద్దలను అడగటం జరిగింది. మేము వాటి చరిత్ర విని ఎంతో ఆశ్చర్యపోయాము. మీరు కూడా ఆ వివరాలు తెలుసుకోండి.

బ్రిటీష్ పాలకులు భారతీయులను ఎన్నో విధాలుగా అనిచివేసారు. ముఖ్యంగా రైతులను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు. భారతీయ రైతులపై బ్రిటిష్వారి అణిచివేతకు దాదాపు 150 సం
వత్సరాల మున సాక్షి ఈ నీలి తొట్టె.

బ్రిటీష్ వారు తమ వస్త్ర పరిశ్రమలో ఉపయోగించుటకు రైతులతో నీలి పంటను సాగు చేయించేవారు. రైతులు ఏదైనా ఆహార పంటను వేయుటకు కూడా అనుమతించేవారు కాదు. ఈ విధంగా సాగు చేసిన నీలి పంటను బ్రిటీష్ తొతల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మవలసి వుంటుంది.

ఈ తొట్టె పని చేసే విధానం: నీలి మందు ఆకులను సేకరించి తొట్టె లో వేసి మూడు లేదా నలుగు రోజులు మురగాపెట్టేవారు. తరువాత ఆకులలో వున్నా రసము అంటా బయటకు వచ్చిన తరువాత ఆకు పిప్పి ని వేరు చేసి ద్రవమును సేకరించేవారు. దీనిని ఇంగ్లాండ్ తీసుకువెళ్ళి వస్త్ర పరిశ్రమలో ఉపయోగించేవారు.

గాంధీజీ దక్షిణ ఆఫ్రికా నుండి భారత దేశము వచ్చిన తరువాత ౧౯౧౭ లో మొట్ట మొదటిగా బ్రిటీష్ వారి మిద పోరాటం చేసిన అంశం --బీహార్లోని చంపారణ్ గ్రామం లోని నీలిమందు రైతుల గురించి.

ఈ నీలి తొట్టె పని చేసే విధానమును ప్రత్యక్షంగా చుసిన వారు ఎవరు లేరు.

నీలి పంట - బ్రిటిష్ వారి పొలిసి గురించి తెలుసుకోవాలంటే మహాత్మా గాంధీ జీవిత చరిత్ర MY EXPERIMENTS WITH TRUTH చూడండి.