Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకంక్షలు బ్లాగ్ నిర్వహణలో సహాయ సహకారాలు అందించుటకు ముందుకు వచ్చిన మిత్రులకు కృతజ్ఞాతలు
మీ అందరికి 'నాదెండ్ల ఆన్ లైన్' ఒక విశిష్టమైన నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నాం. భారతీయ ప్రవాసీ దివస్ సందర్భంగా జనవరి 8,9 తేదిలలో "నాదెండ్ల అన్ లైన్ ప్రవాసి సేవాకేంద్రం" ఏర్పాటు చేయుట జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటగా అవ్వా తాతలు, అమ్మా నాన్నలు తమ పిల్లలను తనివితీరా చూసుకుంటూ ప్రత్యేక్షంగా మాట్లాడుకునే ఏర్పాటు అనగా నెట్ ఫోన్ ను ఏర్పాటు చేయుట జరుగుతుంది ఇది ఎప్పుడు (24*7) అందుబాటులో వుంటుంది నెట్ ఫోన్ నిర్వహణ, వల్లభనేని అమరేంద్ర (9014396141, 7396612449) చూస్తాడు,సాంకేతిక సహకారం s. శ్రీనివాసరావు & చేకూరి అమరేంద్ర అందిస్తారు. ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగిమ్చుకోగలరు అని ఆశిస్తున్నాం.
ఈ నూతన సంవత్సరం మీ అందరికి సంతోషాన్ని, సంపదలు తిసుకరావాలని 'నాదెండ్ల ఆన్ లైన్ టీం' తరుపున కోరుకుంటూ.
మీ
కుమారస్వామి
feed back@ mannekumaraswmy@gmail.com

Wednesday, December 29, 2010

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై సర్వత్ర ఉహాగానాలు

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై సర్వత్ర ఉహాగానాలు చెలరేగుతున్నాయి.... తెలంగాణా తప్పదనీ  అయితే ఇరు వర్గాల మధ్య జల వివాదాలు రాకుండా చూడమని ప్రజానీకం కోరినట్లు అనుకుంటున్నారు. నల్గొండ, హైదరాబాద్ జిల్లాలను Union territory  ప్రాంతాలుగా ప్రకటించమని సిఫార్స్ చేయవచ్చు అని కూడా అనుకుంటున్నారు.

Saturday, December 25, 2010

'నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ 'నిర్వాహణకు ప్రోత్సాహం

నాదెండ్ల ఆన్ లైన్ టీం కు కెమరా పెన్ డ్రైవ్ ను అంద జేస్తున్న వేములపల్లి.బసవయ్య దంపతులు
మన గ్రామానికి చెందిన వేములపల్లి బసవయ్య గారి కుమారుడు శివ బాబు , కేనోన్ కేమెర , 4 GB పెన్ డ్రైవ్ ను ఆన్ లైన్ టీం కు అంద జేసారు . వారికీ నాదెండ్ల ఆన్ లైన్ టీం కృతజ్ఞతలు తెలియజేసింది

Wednesday, December 22, 2010

గ్రామోత్సవం


వర్షాలకు నష్ట పోయిన నాదెండ్ల రైతులు







పంటల వివరాలు సేకరిస్తున్న రైతులు





ఇటీవల కురిసిన భారి వర్షాలకు రైతులు గ్రామంలోని అన్ని ప్రధాన పంటలు నష్ట పోయారు .

ఆరుద్రోచావం (22-12-2010)

మూలస్తానేశ్వరుడు


ఆరుద్రోత్సవం పూజాకార్య క్రమం
స్వామి వారిని ఊరేగింపుకి సిద్డంచేయుట



నేడు మన గ్రామం లో గంగా పార్వతి సమేత శ్రీ మూలస్తానేస్వర స్వామి వారి ఆలయంలో ఆరుద్రోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవం ను శ్రీశైలం, కోటప్పకొండ ,వంటి శైవ క్షేత్రం లో మాత్రమే
నిర్వహించ బడును అనంతరం స్వామి వారు గ్రామోత్సవానికి విచ్చేశారు.

Tuesday, December 21, 2010

ముక్కోటి ఏకాదశి చివరి రోజు గ్రామం లో ఊరేగుతున్న గోవర్ధనస్వామి

గ్రామ వీది లో ఊరేగుతున్న శివాలయం లోని గంగా సమేత శ్రీ మూలస్థానెశ్వర స్వామి
నేటితో ( 5రోజులు )మన గ్రామం లోని గోవర్ధనస్వామి ఆలయం లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనం గా జరిగాయి. 22-12-2010 వ తేది న ఉదయం 7:30 నిమిషాల నుండి 9: గంటల వరకు మనగ్రామం లో శివాలయం గుడి లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభిస్తారు.


Sunday, December 19, 2010

Saturday, December 18, 2010

నాదెండ్ల గ్రామం లో ఘనంగా జరిగిన "మొహారం"(పీర్ల పండుగ) వేడుకలు

మొహారం మాసం పదవ తేదిన"యౌమె ఆషూరా"అంటారు ఇస్లామీయ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత వుంది. ఈరోజు ముస్లింలు రోజా(ఉపవాసం)పాటిస్తారు ఎందుకంటే ఈ"ఆషూరా"రోజునే దైవం ఈ సృష్టి ని సృజించాడు మొట్ట మొదటి సారిగా ఆకాశం నుంచి వర్షం కురిసింది "ఆషూరా" రోజునే. ఈ "ఆషూరా"రోజున ఉపవాసాన్ని పాటించినవారు సుధీర్గ కాలం ఉపవాసాలు పాటించిన దానితో సమానమని అంటారు. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలి గా ఉన్నవారికి అన్నదానం చేయటం, వస్త్రహినులకు వస్త్రాలివ్వటం, ప్రేమగా అనాదుల తల నిమరటం, దాహార్తుల దాహం తీర్చటం, ఆపద లో వున్నా వారిని ఆదుకోవటం, రోగులకు సహాయం చేయటం వంటి పనులు చేసిన వారికి దైవం స్వర్గం లో అమిత మైన గౌరవాన్ని ప్రసాదిస్తాడు.స్వర్గ దస్తర్ ఖాన్ ఫై వారికి విందు ఏర్పాటు చేస్తాడు.స్వర్గం లో ని "సల్ సభీల్"అనే సెలయేరు మధువును త్రాగిస్తాడు. ఈ మాసం 9, 10 తేదీలు లేక ,10, 11 తేదీలు "ఆషూరా" రోజులు పాటించాలి.
పీర్లచావిడి
పీర్ల జెండాలు







పీర్ల జెండా లు ఊరేగింపు

Friday, December 17, 2010

శ్రీ వెంకటేశ్వస్వామి






గోవర్ధన స్వామి


స్వామి వారి ఊరేగింపు కి వాహనం సిద్దం చేయుట

చెన్నకేశవ స్వామి
కోదండరామస్వామి ఆలయం(శంభునిపాలెం)

స్వామి వారి వాహనం సిద్దం చేస్తున్న దృశ్యం

కోదండ రామాలయం లో