Sunday, July 29, 2018

మహిళ - పర్యాయ పదాలు (ఆంధ్ర భారతి నుంచి)

మహిళ - పర్యాయ పదాలు (ఆంధ్ర భారతి నుంచి)

  • అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, అవ్వ, ఆటది, ఆడది, ఆడుగూతురు, ఆడుబుట్టువు, ఇంచుబోడి, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభాస్య, ఇందుముఖి, ఇందువదన, ఇగురాకుబోణి, ఇగురుబో(డి)(ణి), ఇభయాన, ఉగ్మలి, ఉజ్జ్వలాంగి, ఉవిద, ఎలతీగబోడి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకం(ఠ)(ఠి), కంబుగ్రీవ, కనకాంగి, కన్నులకలికి, కప్పురగంధి, కమలాక్షి, కరభోరువు, కర్పూరగంధి, కలకంఠి, కలశస్తని, కలికి, కలువకంటి, కళింగ, కాంత, కించిద్విలగ్న, కిన్నెరకంఠి, కురంగనయన, కురంగాక్షి, కువలయాక్షి, కూచి, కృశమధ్యమ, కేశిని, కొమ, కొమరాలు, కొమిరె, కొమ్మ, కోమ, కోమలాంగి, కోమలి, క్రాలుగంటి, గజయాన, గరిత, గర్త, గుబ్బలాడి, గుబ్బెత, గుమ్మ, గోతి, గోల, చంచరీకచికుర, చంచలాక్షి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చక్కెరబొమ్మ, చక్కెరముద్దుగుమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుటాకుబోడి, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలి, చెలియ, చెలువ, చే(డె)(డియ), చోఱబుడుత, జక్కవచంటి, జని, జలజనేత్ర, జోటి, ఝషలోచన, తనుమధ్య, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళలోచన, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తాటంకవతి, తాటంకిని, తామరకంటి, తామరసనేత్ర, తీయబోడి, తీ(గ)(వ)బోడి, తెఱవ, తెలిగంటి, తొ(గ)(వ)కంటి, తొయ్యలి, తోయజలోచన, తోయజాక్షి, తోయలి, దుండి, ధవళాక్షి, ననబోడి, నళినలోచన, నళినాక్షి, నవ(ల)(లా), నాంచారు, నాచారు, నాచి, నాతి, నాతుక, నారి, నితంబవతి, నితంబిని, నీరజాక్షి, నీలవేణి, నెచ్చెలి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పద్మముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పద్మాక్షి, పర్వేందుముఖి, పల్లవాధర, పల్లవోష్ఠి, పాటలగంధి, పుచ్చడీక, పుత్తడిబొమ్మ, పు(వు)(వ్వు)బోడి, పువ్వారుబోడి, పుష్కలాక్షి, పూబోడి, పైదలి, పొ(ల్తి)(లతి), పొ(ల్తు)(లతు)క, ప్రతీపదర్శిని, ప్రమద, ప్రియ, ప్రోడ, ప్రోయాలు, బంగారుబోడి, బాగరి, బాగులాడి, బింబాధర, బింబోష్ఠి, బోటి, భగిని, భామ, భామిని, భావిని, భీరువు, మండయంతి, మగువ, మచ్చెకంటి, మడతి, మడతుక, మత్తకాశిని, మదిరనయన, మదిరాక్షి, మసలాడి, మహిళ, మానవతి, మానిని, మించుగంటి, మించుబోడి, మీననేత్రి, మీనాక్షి, ముగుద, ముదిత, ముదిర, ముద్దరాలు, ముద్దియ, ముద్దుగుమ్మ, ముద్దులగుమ్మ, ముద్దులాడి, ముష్టిమధ్య, మృగలోచన, మృగాక్షి, మృగీవిలోకన, మెచ్చులాడి, మెఱుగారుబోడి, మెఱుగుబో(డి)(ణి), మెలుత, మె(ల్త)(లత), మె(ల్తు)(లతు)క, యోష, యోషిత, యోషిత్తు, రమణి, రామ, రుచిరాంగి, రూపరి, రూపసి, రోచన, లతకూన, లతాంగి, లతాతన్వి, లలన, లలిత, లలితాంగి, లీలావతి, లేడికంటి, లేమ, లోలనయన, లోలాక్షి, వధువు, వధూటి, వనజదళాయతాక్షి, వనజనేత్ర, వనజాక్షి, వనిత, వరవర్ణిని, వరానన, వరారోహ, వలజ, వశ, వామ, వామనయన, వామలోచన, వారిజలోచన, వారిరుహనేత్ర, వారిరుహలోచన, వారిరుహానన, వాల్గంటి, వాలుగకంటి, వాశిత, వాసుర, విరితీవబోడి, విరిబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శఫరాక్షి, శర్వరి, శాతోదరి, శిఖరిణి, శుకవాణి, శుభదంతి, శుభాంగి, శోభన, శ్యామ, శ్రమణ, సకి, సకియ, సారసాక్షి, సిత, సీమంతిని, సుందరి, సుగాత్రి, సుజఘన, సుదతి, సుదృక్కు, సుధ్యుపాస్య, సునయన, సుప్రియ, సుభాషిణి, సుభ్రువు, సుమతి, సుమధ్య, సుముఖ, సురదన, సులోచన, సువదన, హంసయాన, హరిణలోచన, హరేణువు, హేమ.
courtesy: http://mahilamanulu.blogspot.com/2015/12/blog-post_84.html


Saturday, June 2, 2018

Tuesday, May 15, 2018

గుండెల్లో 'పిడుగులు'

*గుండెల్లో పిడుగులు!* 

 రాష్ట్రంలో పిడుగుల వర్షం మృత్యు గంటికలు మోగిస్తోంది. పిడుగుపాటు శబ్దం వినబడితేనే జనం కలవరపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేననిన్న పిడుగులు ఈ ఏడాది రెండున్నర నెలల్లో పడటం.. 62 మందిని పొట్టన పెట్టుకోవడంతో జనం భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒకేరోజు (ఈనెల ఒకటో తేదీన) 41,025 పిడుగులు పడ్డాయి. కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు, చెవులు చిల్లులు పడేలా పెళపెళమంటూ పడ్డ పిడుగులతో ఈనెల ఒకటో తేదీ ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్షం రోజులు కూడా గడవక ముందే ఈనెల 13న పిడుగుపాట్లు మళ్లీ 13 మందిని బలితీసుకున్నాయి. ఇవి అధికారిక గణాంకాలే. అధికారుల దృష్టికి రాని మరణాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. ఈనెల మూడో తేదీన 33,700 పిడుగులు పడ్డాయని.. మళ్లీ 13న 41,100 పడ్డాయని అనధికారిక సమాచారం. అలాగే, సోమవారం నాడు మరో ముగ్గురు మరణించారు.


 *పిడుగు పడటం అంటే..* 

ఒక మేఘం మరో మేఘంగానీ, ఒక మేఘంలోని అణువులుగానీ రాసుకుంటే విద్యుదాఘాతం ఏర్పడుతుంది. ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి విద్యుత్‌ వెళ్తే భారీ వెలుతురు కనిపిస్తుంది. దానినే మెరుపు అంటారు. విద్యుదాఘాతం ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి కాకుండా భూమివైపు రావడాన్ని పిడుగు అంటారు. ఈ సమయంలో మిలియన్‌ వోల్టుల విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. ఇది కిరణంలా నేలవైపు వస్తున్న క్రమంలో ఆ మార్గం తీవ్రంగా వేడెక్కుతుంది. దీంతో గాలి పక్కకు వ్యాకోశం చెందుతుంది. అందువల్లే పిడుగు పడే సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. ఒకవేళ చెట్లపై కానీ, మనుషులపై కానీ అవి పడితే పడితే కాలిబొగ్గయినట్లు మాడిపోతారు. దీనిని బట్టే దానిలో ఎంత అధిక విద్యుత్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఆకాశం నుంచి భూమిపైకి వచ్చే సమయంలో పిడుగు అనువైన మార్గాన్ని వెతుక్కుంటుంది. అందువల్లే పిడుగు పడే దగ్గర ఎత్తయిన చెట్లు ఉంటే వాటి మీదే ఎక్కువగా పడుతుంటాయి. 

 


 *భూతాపం పెరగడమే కారణం* 

పిడుగుపాట్లు పెరగడానికి భూతాపం ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు. వేసవి కాలంలోనే ఇవి ఎక్కువగా పడుతుండటం ఇందుకు నిదర్శనం. ‘గాలిలో కార్బన్‌ డైయాక్సైడ్‌ 70 ఏళ్ల క్రితం 0.03 శాతం ఉండేది. ఇప్పుడిది 0.041 శాతానికి పెరిగిందని ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. చెట్లు ఎక్కువగా ఉంటే కార్బన్‌ డైయాక్సైడ్‌ను ఇవి పీల్చుకుంటాయి. కానీ, పచ్చదనం తగ్గడంలో వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి’.. అని రిటైర్డ్‌ ప్రొఫెసర్, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ పురుషోత్తమ్‌రెడ్డి తెలిపారు. ఇసుక తుపాన్లకు కూడా ఇదే కారణమని ఆయన వివరించారు. ‘రకరకాల అవసరాల కోసం చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నారు. తర్వాత ఆ స్థాయిలో మొక్కలు నాటడంలేదు. అలాగే, ఎక్కువ లోతు వరకూ ఇనుము, సున్నపురాయి, గ్రానైట్‌ తదితర ఖనిజాలు తవ్వడంవల్ల భూగర్భ జలమట్టం కిందకు పోతుంది. ఇది కూడా భూతాపం పెరగడానికి కొంత కారణమవుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో పిడుగుపాట్లను ముందుగా పసిగట్టే పరిజ్ఞానం లేదు. కానీ, ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయం అరగంట ముందే తెలుసుకునే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. 


పిడుగుల వర్షం ఆశ్చర్యకరమే

రుతుపవనాలకు ముందు వేల పిడుగులు పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది అసాధారణ వాతావరణంగా అనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు సముద్రం నుంచి ఎక్కువగా తేమగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో అనిశ్చితి ఏర్పడుతోంది. వీటికి భూతాపం కూడా తోడవుతోంది. ఫలితంగా ఆకాశంలో అప్పటికప్పుడు క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ పిడుగులు పడడానికి దోహదం చేస్తున్నాయి. ఉత్తరాదిలో ఇసుక తుపానుకు కారణమవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజనుకు ముందు విస్తారంగా వర్షాలు కురుస్తాయి తప్ప ఇంతటి బీభత్సకరమైన పిడుగులు పడడం అరుదు.    



 *జాగ్రత్తలివీ..* 

- పిడుగుపాట్ల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. విద్యుత్‌ నిలిపివేయాలి. 

- బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్యకు తలను వంచి రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి. 

​​​​​​​- వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 

​​​​​​​- పిడుగులు పడే సమయంలో నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీటికి తాకవద్దు. సెల్‌ఫోన్లు, టీవీలు ఉపయోగించవద్దు. 

​​​​​​​- ఉరుములు, మెరుపుల తర్వాత కనీసం 30 నిమిషాల వరకు బయటకు వెళ్లొద్దు.